kumaram bheem asifabad-ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:18 PM
ఆసిఫాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల క్రీడామైదానంలో శుక్రవారం బాల్‌బాడ్మింటన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మన్ అనిల్, డీవైఎస్‌వో అశ్వక్ అహ్మద్‌లు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించి రాష్ట్రచ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల క్రీడామైదానంలో శుక్రవారం బాల్‌బాడ్మింటన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మన్ అనిల్, డీవైఎస్‌వో అశ్వక్ అహ్మద్‌లు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించి రాష్ట్రచ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలుర జట్టులో కృష్ణ లోకానంద్, అంజనేయులు, అఖిల్, రాఘవ, ఆర్షిత్, స్టీఫెన్, ప్రజ్ఞాశీల్, అరుణ్‌సాయి, శ్రీను, శ్రీచైతన్, సాయినాథ్‌రెడ్డి, రోహిత్, హర్షిత్, ప్రణయ్, అంజి, తిరుపతిలు ఉన్నారు. అలాగే బాలికల జట్టులో రిషిత, సిరి, శ్రావ్య, శ్రీలక్ష్మిదేవి, సాద్వి, సహస్ర, నందిని, భవాని, దివ్యశ్రీ, సంజన, ప్రవల్లిక, శివాని, లక్ష్మిప్రియ, హరిక, సౌమ్య, ధనలక్ష్మిలు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు ఈనెల 24 నుంచి 27 వరకు గోలేటి సింగరేణి పాఠశాలలో క్యాంపు నిర్వహించను న్నామని చెప్పారు. 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లాలో జరుగు 45వ బాల్‌బాడ్మింటన్ అంతర్‌జిల్లాల పోటీల్లో పాల్గొననున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్‌బాడ్మింటన్ కార్యదర్శి తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, పీడీలు, పీఈటీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రాకేష్, నరేష్, యాదగిరి, అరవింద్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.