Share News

బాల్క సుమన్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - May 27 , 2026 | 11:29 PM

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ టీబీ జీకేఎస్‌ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్ష మాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డి మాండ్‌ చేశారు.

బాల్క సుమన్‌ క్షమాపణ చెప్పాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, మే 27 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ టీబీ జీకేఎస్‌ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్ష మాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డి మాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావే శం లో ఆయన మాట్లాడారు. బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని గు డాయిజాన్ని, రౌడీయిజాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం రైల్వేను అభివృద్ధి పరుస్తూ వందేభారత్‌, బుల్లెట్‌ రైళ్ల ఏర్పా టుకు ప్రయత్నం చేస్తుండగా బాల్క సుమన్‌ రైల్వే ట్రాకులు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయండి అని పిలుపునివ్వడం సమంజసం కాదన్నారు. రెండేళ్ల పా టు అధికారం కోల్పోగానే రైతులు తమ వద్దకు రావడం లేదని తాము చేసే ఉద్యమాల్లో పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ కార్యకర్తలకు మి లిటెంట్‌ ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం ముమ్మాటికి అసాంఘీక శక్తు లను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. దాడులు చేయాలని తెలంగాణ యువతను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.

ఇలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, వెంటనే వీటిని ఉపసంహరిం చుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్‌, నాయకులు వెంక టేశ్వర్‌, వెంకటనర్సయ్య, పున్నం చంద్‌, రామయ్య, శంకర్‌, శ్రీనివాస్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:29 PM