Share News

మతిభ్రమించి మాట్లాడుతున్న బాల్క సుమన్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:53 PM

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని రాష్ట్రంలో ఏ మంత్రి ఏ శాఖలో పనిచేస్తున్నారో కనీస అవగా హన లేకుండా లేని పోని విమర్శలు చేస్తున్నా డని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ రెడ్డి పేర్కొన్నారు.

మతిభ్రమించి మాట్లాడుతున్న బాల్క సుమన్‌

డీసీసీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి

మందమర్రిటౌన్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని రాష్ట్రంలో ఏ మంత్రి ఏ శాఖలో పనిచేస్తున్నారో కనీస అవగా హన లేకుండా లేని పోని విమర్శలు చేస్తున్నా డని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారని, ప్రజల ఆదరణ పొందుతుంటే దీన్ని చూసి బాల్క సు మన్‌ తట్టుకోలేక పోతున్నాడన్నారు. సింగరేణి గురించి చూసేది డిప్యూటి సీఎం మల్లు భట్టి వి క్రమార్క అన్న సంగతి బాల్క సుమన్‌కు తెలి యదన్నారు. కార్యకర్తలకు కనీస మర్యాద ఇవ్వ ని బాల్క సుమన్‌ ఇప్పుడు కార్యకర్తలను సింగ రేణి ఆస్తుల ను తగలబెట్టాలని, రైలు పట్టాలని కోయాలని చెప్పడం హేయమైన చర్య అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మంద తిరుమల్‌ రెడ్డి, పైడిమల్ల నర్సింగ్‌, ఏడుకోళ్ల పవన్‌, రాచర్ల గణేష్‌, వీరన్న, దుర్గం ప్రభాకర్‌, ఎండీ పాషా, శేఖర్‌, ఎర్ర రాజు, రాయబారపు కిరణ్‌, ఎండీ ఇసాక్‌, విజయ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు

రామకృష్ణాపూర్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వ హ యాంలో జరుగుతున్న అ భివృద్ధిని చూసి ఓర్వ లేకనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మతిస్థి మితం కోల్పోయి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘు నాధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఇటీవల చంచల్‌ గూ డ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్‌ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడ న్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వొ డ్నాల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ భీమ మల్లేష్‌, నాయ కులు కాసర్ల ప్రకాష్‌, బత్తుల శ్రీనివాస్‌, గోపు రాజం, మేకల సురేందర్‌, ఏల్పుల సత్య నారా యణ, సుధాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 10:53 PM