చంచల్‌గూడ జైలుకు బాల్క సుమన్
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:19 AM
సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం అర్ధరాత్రి ....
సైదాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం అర్ధరాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణ భవన్ వద్ద సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణ అనంతరం హిమాయత్‌నగర్‌లోని నాంపల్లి కోర్డు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో బాల్క సుమన్‌ను భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు.
లంచం కేసులో ఇన్‌స్పెక్టర్ మహేందర్ రిమాండ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్‌ను పోలీసులు శనివారం అర్ధరాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సైబర్ మోసం కేసులో బాధిత కుటుంబ సభ్యుల నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బత్తుల మహేందర్‌ను శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం విదితమే.