Share News

kumaram bheem asifabad- కన్నుల పండువగా బాలేశ్వర జాతర

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:50 PM

ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు నది తీరాన కొలువు దీరిన శ్రీ బాలేశ్వర స్వామి జాతర ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని ఏటా ఆలయ సమీపంలోని పెద్దవాగు నది తీరాన జాతర నిర్వహిస్తారు. ఉదయం నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీధర్‌శర్మ, రవిచంద్ర చందవార్‌, బాలేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు.

kumaram bheem asifabad- కన్నుల పండువగా బాలేశ్వర జాతర
రథం లాగుతున్న భక్తులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు నది తీరాన కొలువు దీరిన శ్రీ బాలేశ్వర స్వామి జాతర ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని ఏటా ఆలయ సమీపంలోని పెద్దవాగు నది తీరాన జాతర నిర్వహిస్తారు. ఉదయం నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీధర్‌శర్మ, రవిచంద్ర చందవార్‌, బాలేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. సాయంత్రం స్వామి వారి విగ్రహాన్ని ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. అంతకు ముందు కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌ జ్యోతి ప్రజ్వాలన చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులందరు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జాతరకు ఆసిఫాబాద్‌ మండలంతో పాటు చుట్టు పక్కల మండలాలు అయిన వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, కెరమెరి మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల తాకిడితో పెద్దవాగు నది తీరం భక్త జన సంద్రంగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారిని కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌లు దర్శించుకోగా వీరిని అలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, ఏఎంసీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్లు ఇరుకుల్ల మంగ, రవిందర్‌, సినీ దర్శక, నిర్మాత దండనాయకుల సురేష్‌కుమార్‌, బీసీ సంఘం నాయకుడు రమేశ్‌ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్లు చిలువేరి వెంకన్న, గాదవేణి మల్లేష్‌, బీజేపీ నాయకులు మల్లికార్జున్‌, ఖాండ్రే విశాల్‌, బీఆర్‌ఎస్‌ నాయకురాలు సరస్వతి, రవిందర్‌, ఆలయ కమిటీ సభ్యులు రాపర్తి రవిందర్‌, ఆమ్టే అనూప్‌, తాటిపెల్లి దిలీప్‌, బలవంత్‌, అభయ్‌ కుమార్‌, వారణాసి శ్రీనివాస్‌, దండనా యకుల చంద్రకాంత్‌, రాజేశ్వర్‌ మసాడే, టీఆర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 09:50 PM