Share News

క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:48 AM

క్యాన్సర్‌ను సకాలంలో పసిగట్టి తగిన వైద్య చికిత్స అందించడమే లక్ష్యంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సును అందుబాటులోకి తెచ్చామని సినీ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌...

క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యం

  • బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణ

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను సకాలంలో పసిగట్టి తగిన వైద్య చికిత్స అందించడమే లక్ష్యంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సును అందుబాటులోకి తెచ్చామని సినీ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. క్యాన్సర్‌ గుర్తింపు పరీక్షలకు సంబంధించి బసవతారకం ఆస్పత్రికి ఇప్పటికే ఓ స్ర్కీనింగ్‌ బస్సు ఉండగా ఇది రెండోది. రూ.2కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ఈ అత్యాధునిక స్ర్కీనింగ్‌ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అలాగే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వైద్య చికిత్స విధానం బ్రాకోథెరఫీ వార్డును, రోగుల కోసం అభివృద్ధి చేసిన యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అమెరికాకు చెందిన డా.తులసీదేవి పోలవరపు సహకారంతో ప్రత్యేక స్ర్కీనింగ్‌ బస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండో బస్సు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా రోగులకు వైద్యు సేవలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ట్రస్టు బోర్డు సభ్యులు జేఎ్‌సఆర్‌ ప్రసాద్‌, సీఈవో డా. కె కృష్ణయ్య, మెడికల్‌ డైరెక్టర్‌ డా. టీఎస్‌ రావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. ఫణి కోటేశ్వర రావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ డా. కల్పనా రఘునాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 04:48 AM