Share News

28న బక్రీద్‌.. శాఖాపరమైన పరీక్షలు వాయిదా

ABN , Publish Date - May 23 , 2026 | 04:56 AM

ఈ నెల 28న బక్రీద్‌(ఈదుల్‌ జుహా) జరగనుంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీన బక్రీద్‌ పండుగ ఉంటుందని తొలుత సెలవు ప్రకటించారు.

28న బక్రీద్‌.. శాఖాపరమైన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28న బక్రీద్‌(ఈదుల్‌ జుహా) జరగనుంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీన బక్రీద్‌ పండుగ ఉంటుందని తొలుత సెలవు ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలవంక దర్శనంతో పండుగ తేదీ మారింది. సౌదీ ఆరేబియాతో పాటు ఖతార్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో ఈ నెల 27వ తేదీన బక్రీద్‌ పండుగ చేసుకోనుండగా... ఆ మరుసటి రోజు భారతదేశ ంలో బక్రీద్‌ పండుగ జరుపుకోనున్నారు. దాంతో ఆ రోజు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలను జూన్‌ 3వ తేదీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) మార్చింది. ఇక కేంద్రప్రభుత్వం కూడా బక్రీద్‌ సెలవును ఈ నెల 28వ తేదీకి మార్చింది. ఈ మేరకు శుక్రవారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీవోపీటీ) సర్క్యులర్‌ జారీ చేసింది.

Updated Date - May 23 , 2026 | 04:56 AM