Share News

kumaram bheem asifabad- ఘనంగా బడుగ పండగ

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:34 PM

పొలాల అమావాస్య మరునాడు నిర్వహించే బడుగ పండుగ మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మట్టితో చేసిన ఎడ్లను ప్రత్యేకంగా పూజలు చేసి ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటిని వేడుకల్లో భాగం చేశారు.

kumaram bheem asifabad- ఘనంగా బడుగ పండగ
మెరిలో వన దేవతలకు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పొలాల అమావాస్య మరునాడు నిర్వహించే బడుగ పండుగ మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మట్టితో చేసిన ఎడ్లను ప్రత్యేకంగా పూజలు చేసి ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటిని వేడుకల్లో భాగం చేశారు. పోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చరణ్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు టేకం గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం బడుగ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలను పూజించి మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో బడుగ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్ని సమీప వనదేవతల వద్ద పూజలు నిర్వహించారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రామ దేవతలను పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో బడుగ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామ పొలిమేరల్లో ఉన్న దేవత విగ్రహాలకు పూజలు చేశారు.

పెంచికల్‌పేట (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉదయం నుంచి గ్రామ పొలిమేరల్లో ఉన్న దేవత విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో శుక్రవారం బడుగ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామ పొలిమేరల్లో ఉన్న దేవత విగ్రహాలకు పూజలు చేశారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండల కేంద్రంతో పాటు గిరిజన గ్రామాల్లో బడుగ పండుగను ఘనంగా జరుపుకున్నారు. వన దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల్లోని పొలిమేరల్లో ఉండే పోచమ్మ గుడిల వద్ద రద్దీ ఏర్పడింది.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు గిరిజన గ్రామాల్లో బడుగ పండుగను ఘనంగా జరుపుకున్నారు. వన దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:34 PM