Share News

kumaram bheem asifabad- బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:45 PM

: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రజాతంత్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హలులో శనివారం డీవైఎఫ్‌ఐ నాల్గో జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు

kumaram bheem asifabad- బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
మాట్లాడుతున్న డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రజాతంత్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హలులో శనివారం డీవైఎఫ్‌ఐ నాల్గో జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దిమాక్‌ నక్సలైట్లు అంటూ ప్రధాని ముద్ర వేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును గౌరవించాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ కాలెండర్‌ యూత్‌ డిక్లరేషన్‌ హమీలను అమలుచేయాలని చెప్పారు. రాజీవ్‌ యువ వికాస పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డీవైఎఫ్‌ఐ నాయకులు టికానంద్‌, కార్తీక్‌, నిఖిల్‌, పురుషోత్తం, సతీష్‌, మంజుల, సవిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:45 PM