రైల్వే ప్లాట్‌ఫాంపై ప్రసవం
ABN , Publish Date - May 25 , 2026 | 05:35 AM
రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ మహిళ ప్రసవించింది. ఈ సంఘటన తాండూరు రైల్వేస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది.
తాండూరు రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి ఘటన
స్పందించని 108 అంబులెన్సు..తల్లీబిడ్డను ఆస్పత్రిలో చేర్పించిన ఆటో డ్రైవర్
తాండూరు, తాండూరు రూరల్, మే 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ మహిళ ప్రసవించింది. ఈ సంఘటన తాండూరు రైల్వేస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన మహేశ్వరి కొన్నాళ్లుగా భర్తతో దూరంగా ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. గర్భవతి అయిన మహేశ్వరిని కుటుంబసభ్యులు వారం రోజుల క్రితం తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆమెకు ఫిట్స్ రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మహేశ్వరి శనివారం రాత్రి తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ఉన్న ఆమెకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారం అందించినా.. వారు స్పందించలేదు. అప్పటికే సదరు మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. గమనించిన ముస్తాఫా అనే ఓ ఆటో డ్రైవర్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో తల్లీబిడ్డను సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నాడు. మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తల్లీబిడ్డను పరామర్శించారు.