Share News

kumaram bheem asifabad-బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయం

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:30 PM

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా షెడ్యూల్డ్‌ కులాలు, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు

kumaram bheem asifabad-బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయం
జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా షెడ్యూల్డ్‌ కులాలు, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. మహనీయుల ఆశయాలను కొనసాగించి జిల్లా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్సీ అభివృద్ధి అధికారి అశోక్‌, కుల సంఘాల ప్రతినిధులు కేశవరావు, అర్జు, గంగుబాయి, గణేష్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలోని చింతగూడ చౌరస్తాలో జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు వేర్వేరుగా పాల్గొని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ చింతగూడ చౌరస్తాకు బాబూ జగ్జీవన్‌రామ్‌ చౌరస్తాగా నామరణం చేయాలని మున్సిపల్‌ అధికారులను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సాహిన్‌ సుల్తానా, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అనిత, కౌన్సిలర్లు విశ్వేశ్వర్రావు, అలియాబేగం, లావణ్య, శ్రీనివాస్‌, జ్యోతి, సుభాష్‌, జయదేవ్‌, నాయకులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యకరమంలో నాయకులు సంతోష్‌, నర్సింగరావు, పోచయ్య, అశోక్‌, ఇస్తారి, రాజేష్‌, స్వామి, భీంరాజ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మాజీ ఉపప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్‌ దేశ స్వాతంత్య్ర సమరమోధుడిగానే కాకుండా దళితుల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చునార్‌కార్‌ సతీష్‌, మాజీ పీఏసీస్‌ చైర్మన్‌ పెంటు, మాజీ సర్పంచ్‌ తుకారాం పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ జయంతిని మండలంలోని సలుగుపల్లిలో ఘనంగా నిర్వహివంచారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శ్రీహరి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, రాజ్‌కుమార్‌, విలాస్‌, సుభాష్‌, శంకర్‌, అశోక్‌, లలిత, పార్వతి, విమల తదితరులు పాల్గొన్నారు.

కౌటాల (ఆంధ్రజ్యోతి): మండలంలోని విద్యావనరుల కేంద్రంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో నానాజీ, చింతలమానేపల్లి ఎంఈవో జయరాజు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 10:30 PM