అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:28 PM
రై తులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగా హన పెంచుకొని, శాస్త్రీ సాగు విధానాలను అను సరించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధిం చాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచిం చారు.
- 112వ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
తాడూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రై తులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగా హన పెంచుకొని, శాస్త్రీ సాగు విధానాలను అను సరించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధిం చాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచిం చారు. మంగళవారం మండలంలోని ఇంద్రకల్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన 112వ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రైతులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధి కారులు, వ్యవసాయ శా స్త్రవేత్తలు అందించిన సూచనలను రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించా రు. సూపర్ ఎల్‌నినో ప్ర భావం, వాతావరణ పరి స్థితులకు అనుగుణం గా పంటల సాగు, బిందు సే ద్యంతో కూరగాయలు, ఆకుకూరల సాగు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాతావర ణం, నేల స్వభావం, నీటి లభ్యత ను పరిగణలోకి తీసుకొని సాగు ప్రణాళిక రూపొందించుకో వాలని నిపుణులు సూచించారు. బిందు సేధ్యం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటల ఉ త్పాదకతను పెంచుకోవచ్చని వివ రించారు. కార్యక్రమంలో జిల్లా వ్య వసాయ అధికారియ శ్వంత్‌రావు, డీఆర్‌డీఓ పీడీ చిన్నఓబులేష్, జి ల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటే శం, జిల్లా సహకార అధికారి, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
తాడూరు మండల పరిధిలోని కేజీబీవీ పాఠ శాలను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగ ళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దసరా సెల వుల అనంతరం విద్యార్థినుల హాజరు శాతం, ఉపాధ్యాయుల హాజరు, విద్యాబోధన తీరును పరిశీలించారు. విద్యార్థునులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో అంది స్తున్న పౌష్టికాహారం నాణ్యతను తనిఖీ చేసి, బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, అవసరమైన సౌకర్యాలు అందేలా చూడాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.