ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:34 PM
వర్షాకాలం వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవ గాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కాసిపేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవ గాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన పరి శీలించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సా గు చేసే కంది, పెసర, మినుముతో పాటు కూరగాయలు సాగు చేసుకునేలా రైతు లను వ్యవసాయాధికారులు ప్రోత్సహించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వన రులను ఉపయోగించుకుంటూ పంటలను సాగు చేయాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్య మైన భోజనాన్ని విద్యార్థినులకు అందించాలన్నారు. వంట గదిని , డైనింగ్ హాల్‌ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, మరు గుదొడ్లను, స్నానపు గదులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కలెక్ట ర్ వెంట ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల వ్యవసాయాధికారి చల్ల ప్రబాకర్, కేజీబీవీ ఎస్‌వో సరిత ఉన్నారు.