నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:19 PM
నేరాల నివారణపై ప్రజలకు అవగా హన కార్యక్రమం చేపట్టాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నారు.
- కోడేరు పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్
కోడేరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : నేరాల నివారణపై ప్రజలకు అవగా హన కార్యక్రమం చేపట్టాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నారు. వా ర్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేష న్‌ను ఎస్పీ తనిఖీచేశారని ఎస్‌ఐ వే ణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో వివిధ రికార్డులను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసులు, వాటి ద ర్యాప్తు పురోగతి, గ్రేవ్, ప్రాపర్టీ నేరాలు, నేర ని యంత్రణ చర్యలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు వివ రాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితుల పర్యవేక్షణ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీ లించి సలహాలు, సూచనలు చేశారు. విధి నిర్వ హణ, బీట్ వ్యవస్థ, రాత్రి పహారా, శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివార ణ, అవగాహన కార్యక్రమం చేపట్టాలని సూచిం చారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగే లా చూడాలని ఎస్‌ఐని ఆదేశించారు. ఆయన వెంట బి.శ్రీని వాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, బి.ఎస్‌ఐ శంకర్‌నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.