Share News

ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:04 PM

ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూచించారు.

ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూచించారు. బుధ వారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 60మంది విద్యార్థు లకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిం చారు. విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ, బాధ్యతాయుతమైన పౌ రులుగా వ్యవహరించాల్సిన అంశాలను తమ రచనలు, చిత్రాల ద్వారా చక్కగా వ్యక్తీకరించా రు. పోటీల్లో ప్రతిభ కనబర్చి ఉత్తమంగా ఎంపి కైన విద్యార్థులకు కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ ఓటు అనేది హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతీ పౌరుడికి ఉన్న ముఖ్యమైన బాధ్యత అని వివరించారు. కార్యక్ర మంలో అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్‌కుమార్‌, విద్యాశాఖ అధికారులు నిర్మల, పరమేశ్వర్‌, వివిధ పాఠశాలల ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.

ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భరోసా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేయ నున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథ కంలో జిల్లాలోని అర్హులైన ప్రతీ కుటుంబాన్ని త ప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్‌ హేమం త కేశవ్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బు ధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవ సహాయం, అచ్చంపేట సబ్‌కలెక్టర్‌ సలోనిచాబ్రా, డీఆర్వో పాండుతో కలిసి జిల్లా అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ కు టుంబ జీవిత బీమా పథకం విధి విధానాలు, అ ర్హతలు నమోదు ప్రక్రియపై కలెక్టర్‌ అధికారు లకు వివరించారు. రాష్ట్రంలోని అర్హులైన కుటుం బానికి రూ.5లక్షల జీవిత బీమా భద్రత కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రీసర్వేకు రైతులు సహకరించాలి

- అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా

లింగాల, (ఆంధ్రజ్యోతి) : భూముల రీ-సర్వే పనులకు రైతులు సహకరించాలని అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాడాపూర్‌, అంబట్‌పల్లి గ్రామాల శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ అధికారులు ముందస్తుగా భూముల రీ సర్వేపై సమాచారం ఇస్తున్నారా లేదా అనే విష యాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కా ర్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేష్‌, డీటీకృష్ణాజీ, ఆర్‌ఐ అనిల్‌, సర్వేయర్‌ రాంబాబు, జీపీవో రమే ష్‌, జంగయ్య, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:04 PM