Share News

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:28 PM

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అవగాహన ఎంతో ముఖ్యమని అగ్ని మాపకశాఖ సిబ్బంది అన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కల్వకుర్తి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అవగాహన ఎంతో ముఖ్యమని అగ్ని మాపకశాఖ సిబ్బంది అన్నారు. కల్వ కుర్తి వ్యవసాయ మార్కెట్‌ సముదా య ప్రాంగణంలో గురువారం ఫైర్‌ సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవిం చడానికి గల కారణాలు, వాటిని ముందుగానే ఎలా నివారించాలి, ప్రమాదం జరిగినప్పుడు తీ సుకోవాల్సిన అత్యవసర చర్యల గురించి వివరిం చారు. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగంపై ప్రద ర్శన నిర్వహించి అగ్ని ప్రమాద సమయంలో భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ అధికారులు, వ్యాపా రులు, రైతులు, హమాలీలు, ఫైర్‌ శాఖ సిబ్బం ది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అగ్ని మాపక పరికరాల వినియోగంపై ప్రాక్టికల్‌ డెమో నిర్వహించి అందరిలో భద్రతపై చైత న్యం పెంపొందించారు.

Updated Date - Jun 04 , 2026 | 11:28 PM