kumaram bheem asifabad- ప్రజలకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:54 PM
జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మం ఈనెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించాల్సి ఉన్నందున జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌తో కలిసి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రెడ్‌క్రాస్ సోసైటీలో సభ్యత్వం, తపాలశాఖలో ప్రదానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద బీమా పాలసీ ఆంశాలపై బుధవారం సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) :జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మం ఈనెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించాల్సి ఉన్నందున జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌తో కలిసి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రెడ్‌క్రాస్ సోసైటీలో సభ్యత్వం, తపాలశాఖలో ప్రదానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద బీమా పాలసీ ఆంశాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన ఽధ్రువపత్రాల ఫారంతో పాటు బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీలో ప్రతీ ఒక్కరు సభ్యత్వం చేసుకోవాలన్నారు. భారతీయ తపాతాశాఖలో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరు రూ. 565 చెల్లించేలా దినపత్రికలు వివిధ ప్రచార ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం 2026-28 సంవత్సరానికి గాను నూతన అక్రిడిటేషన్ కార్డులను జర్నలిస్టులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో డీపీఆర్‌వో సంపత్‌కుమార్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి
ఆసిఫాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు తపాలాశాఖలో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పాలసీ తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బీమాదారుల కుటుంబాలకు బుధవారం బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియా పోస్టు పెమేంట్ బ్యాంకు మంచిర్యాల బ్రాంచ్‌లో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కింద బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సిహెచ్ లక్ష్మి మరణించినందున నామినీ అయిన పెంటుబాయికి రూ. 2లక్షల చెక్కును అందించామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన కనక కమల రాయల్ సుందరం పథకం కింద రూ. 565 ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నారని చెప్పారు. కమల ప్రమాదావశాత్తు పాము కాటుకు గురై మరణించడంతో ఆమె కుమారుడు కనక సుధాకర్‌కు రూ. 10 లక్షల బీమా చెక్కును అందజేశామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. 18-65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తపాలాశాఖ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ ఆర్‌ఎం ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.