Share News

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:36 PM

సె కండరీ గ్రేడ్‌టీచర్స్‌ యూనియన్‌ నాగర్‌కర్నూ ల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి డివిజన్‌లో విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న ఉపా ధ్యాయులకు డివిజన్‌స్థాయి ఉత్తమ ఉపాధ్యా య పురస్కారాలను అందజేశారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఎంఈవో శంకర్‌నాయక్‌, ఎస్‌జీటీయూ నాయకుడు రాజేందర్‌

కల్వకుర్తి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : సె కండరీ గ్రేడ్‌టీచర్స్‌ యూనియన్‌ నాగర్‌కర్నూ ల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి డివిజన్‌లో విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న ఉపా ధ్యాయులకు డివిజన్‌స్థాయి ఉత్తమ ఉపాధ్యా య పురస్కారాలను అందజేశారు. ఆదివారం కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో శంకర్‌నాయక్‌, ఎస్‌జీ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రాజేం దర్‌లు హాజరయ్యారు. కల్వకుర్తి రెవెన్యూ డివి జన్‌ పరిధిలోని కల్వకుర్తి, వంగూరు, వెల్దండ, ఊర్కొండ, చారకొండ మండలాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులన ఉత్తమ పాఠశాలలను గుర్తించి సన్మానించారు. ఎంఈవో శంకర్‌నాయ క్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పుర స్కరించుకుని ప్రాథమిక పాఠశాలల్లో పని చే స్తున్న ఎస్‌టీయూ ఉపాధ్యాయుల సేవలను గు ర్తించి సన్మానించడం అభినందనీయమన్నారు. డివిజన్‌ స్థాయిలో 30మంది ఉపాధ్యాయులకు, 8ఉత్తమ పాఠశాలలను సన్మానించినట్లు ఎస్‌జీ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రాజేం దర్‌ తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఇద్రీస్‌, కోశాధికారి శ్రీకాంత్‌, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు సందీ ప్‌, మహేష్‌, హరికృష్ణ, పద్మ, లక్ష్మీనరసింహ, రాజేందర్‌రెడ్డి, ఫిరోజ్‌, రజిత షమీమ్‌ బేగం, చంద్రశేఖర్‌,రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:36 PM