వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:43 PM
తరగతి గదిలో వెనుకబడిన వి ద్యార్థులను ఉపాధ్యాయులు వారి పట్ల శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమ వారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
కస్తూర్భా పాఠశాలను సందర్శించిన కలెక్టర్
నస్పూర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : తరగతి గదిలో వెనుకబడిన వి ద్యార్థులను ఉపాధ్యాయులు వారి పట్ల శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమ వారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఎనిమిద తరగతి గదిని సం దర్శించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిక్షించారు. ఓ విద్యార్థినితో పుస్తకంలోని పాఠం చదివించారు. విద్యార్థులకు ఆర్థమైయ్యే విధంగా వి ద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. పౌష్టికాహారాన్ని విద్యార్థులకు సకాలంలో అందించాలని సూచించారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. వంట గది, సరు కులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మౌనిక ఉన్నారు.