Share News

ఆర్టీసీ ఎన్నికల్లో పట్టుకు యత్నం...

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:32 PM

ఆర్టీసీ ఎ న్నికల్లో పట్టు సాధించేందుకు వివిధ యూనియన్ల నా యకులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మి కుల మద్దతు కోసం నిత్యం డిపోల వద్ద పడిగాపులు కాస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో పట్టుకు యత్నం...

-పోటాపోటీగా డిపోల వద్ద ప్రచారం

-ఇప్పటికే గుర్తులు కేటాయించిన కార్మికశాఖ

-ఈ నెల 9న బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌

-ఏకగ్రీవంగా రీజనల్‌ కమిటీ ఎన్నిక

మంచిర్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఎ న్నికల్లో పట్టు సాధించేందుకు వివిధ యూనియన్ల నా యకులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మి కుల మద్దతు కోసం నిత్యం డిపోల వద్ద పడిగాపులు కాస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆర్టీసీలో గుర్తింపు ఎన్నిక లు జరుగుతున్నందున అన్ని కార్మిక సంఘాలు ప్రతి ష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ప్రభుత్వ హయాం లో ఆర్టీసీ యూనియన్లపై ఉక్కుపాదం మోపడంతో ఇంతకాలం కార్మిక సంఘాలు ఉండీ లేని చందంగా తయారయ్యాయి. రాష్ట్రంలో చివరి సారిగా 2016లో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు జరుగగా, ఇంతకాలం యూ నియన్ల గొంతు మూగబోయింది. కార్మికులకు ఏ సమ స్య వచ్చినా ప్రాతినిథ్యం వహించలేని అచేతనావస్థ లో సంఘాలు మిన్నకుండి పోయాయి. డిపోల్లోనూ యూనియన్‌ నాయకులే లక్ష్యంగా అధికారులు కక్ష సా ధింపు చర్యలకు పాల్పడ్డ సంఘటనలు కోకొల్లలుగా ఉ న్నాయి. ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు పూను కోవడంతో వివి ధ సంఘాల ప్రతినిధులు, కార్మికుల్లోనూ ఆనందం వె ల్లివిరుస్తోంది. దీంతో ఎన్నికల్లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో అన్ని యూనియన్లు ఉండగా, కార్మి కులను తమ వశం చేసుకునేందుకు నాయకులు ఆరా టపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 5 నుం చి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నా రు. 14,15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎలెక్షన్‌ నిర్వ హించనుండగా, 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

ఖరారైన గుర్తులు...

రాష్ట్ర కార్మికశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్ర కారం ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆ ర్టీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో డిపోల వారీగా ఓటర్ల జాబి తాను విడుదల చేయగా, కార్మికశాఖ ఆయా సంఘా లకు గుర్తులు కూడా కేటాయించింది. గతంలో ఎ న్నడూ లేని విధంగా ఈ సారి ఆర్టీసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటుండగా, ఆయా పార్టీల త రుపున కార్మిక సంఘాలను బరిలో దింపుతున్నారు. ఆ ర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధానంగా 12 యూ నియన్లు బరిలో దిగుతుండగా, ఆదిలాబాద్‌ రీజియ న్‌లో మాత్రం రెండు యూనియన్ల మధ్యనే పోటీ ఉం డనుంది. ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ), తె లంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ), నేషన ల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) ఐక్యంగా పో టీ చేస్తుండగా, ఆ కూటమికి టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయి స్‌ యూనియన్‌గా నామకరం చేయగా, బస్సు గుర్తు ను కార్మికశాఖ కేటాయించింది. సీపీఐ అనుబంధ సం స్థ ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూకు థామస్‌ రెడ్డి వర్గం నాయకత్వం వహిస్తోంది. ఇదిలా ఉండగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్‌ టీయూసీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతుం డగా, ఆ యూనియన్‌ తరుపున స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూ నియన్‌ (ఎస్‌డబ్ల్యుయూ), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడ రేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌), తెలంగాణ వర్కర్స్‌ యూని యన్‌ (టీడబ్ల్యుయూ) ఐక్యంగా బరిలోకి దిగుతుండ గా, దీనికి అశ్వద్థామరెడ్డి వర్గం నాయకత్వం వహి స్తోంది. ఈ కూటమికి తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూ నియన్‌గా నామకరణం చేయగా, బాణం గుర్తును కా ర్మికశాఖ కేటాయించింది.

తుది ఓటరు జాబితా విడుదల....

ఆర్టీసీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్‌ రీజియన్‌లో తుది ఓటరు జాబితా ప్రకారం మొత్తం 1774 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. రీజియన్‌ పరిధిలోని ఆదిలాబాద్‌ డిపోలో 398 మంది ఓటర్లు ఉండగా, నిర్మల్‌ డిపోలో 385 మంది, మంచిర్యాల డిపోలో 403 మంది, భైంసా డిపోలో 193 మంది, ఉట్నూరు డిపోలో 112 మంది, ఆసిఫాబాద్‌ డిపోలో 251 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా రీజియన్‌ మేనేజర్‌ కార్యాలయం స్టాఫ్‌ మరో 31 మం ది కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రీజనల్‌ కమిటీ ఎన్నిక....

ఆర్టీసీ ఎన్నికల్లో విజయం కోసం అధికార పార్టీకి అనుబంధంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ రీజనల్‌ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రీజనల్‌ అధ్య క్షుడిగా జి విష్ణు ఎన్నిక కాగా, సెక్రటరీగా వి భీమేశ్వ ర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎం మల్లేశం, కోశాధి కారిగా ఎస్‌ సమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం కేశవ్‌, సంయుక్త కార్యదర్శిగా హెచ్‌ సంతోష్‌ ఎన్నికయ్యారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అను బంధ సంఘం ఐఎన్‌టీయూసీ గెలుపునకు రీజనల్‌ కమిటీ సభ్యులు కృషి చేయనున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:32 PM