Share News

ఇండియా కూటమి ఎంపీలపై దాడి అప్రజాస్వామికం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:33 PM

ఢిల్లీలో ఇండియా కూటమి ఎం పీలపై జరిగిన దాడి అప్రజాస్వామిక మని అచ్చంపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు గుండె వెంకట్‌గౌడ్‌, డీసీసీ ప్ర ధాన కార్యదర్శి జమ్మికింది బాల్‌రాం గౌడ్‌ అన్నారు.

ఇండియా కూటమి ఎంపీలపై దాడి అప్రజాస్వామికం
నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

చారకొండ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యో తి) : ఢిల్లీలో ఇండియా కూటమి ఎం పీలపై జరిగిన దాడి అప్రజాస్వామిక మని అచ్చంపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు గుండె వెంకట్‌గౌడ్‌, డీసీసీ ప్ర ధాన కార్యదర్శి జమ్మికింది బాల్‌రాం గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆ దేశాల మేరకు గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్య క్తం చేశారు. వారు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం జవాబు దారీతనం కోరుతూ ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్దకు శాం తియూతంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని బలప్రయోగానికి గురి చేయడం సరైందికాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘా న్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. కార్యక్ర మంలో ఆయా గ్రామాల సర్పంచులు శంకర్‌ ముదిరాజ్‌, కట్ట సహదేవ్‌, బోడి శివరాం, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గణేష్‌ గౌడ్‌, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు గోరటి శివ, మాజీ వైస్‌ ఎంపీపీ సాంబయ్యగౌడ్‌, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌, కాంగ్రెస్‌ మండల కార్యదర్శి నర్సింహచారి, నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములు, రవిగౌడ్‌, రూప్‌సింగ్‌, జంగులు, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:33 PM