Share News

‘భరోసా’ అందింది

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:11 PM

అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందింది. యాసంగి పెట్టుబడి సాయంగా మొదటి ఎకరానికి రూ. 6 వేల చొప్పున ప్రభు త్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది.

‘భరోసా’ అందింది

-రైతుల ఖాతాల్లోకి జమైన సొమ్ము

-యాసంగికి ప్రభుత్వ పెట్టుబడి సాయం

-మొదటి ఎకరానికి రూ. 6 వేలు

-జిల్లాలో 1.52 లక్షల మందికి లబ్ధీ

-రైతుల ఖాతాల్లోకి రూ.78 కోట్లు

నెన్నెల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందింది. యాసంగి పెట్టుబడి సాయంగా మొదటి ఎకరానికి రూ. 6 వేల చొప్పున ప్రభు త్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అదనులో సా యం అందడంతో రైతులు సంబరపడిపోతున్నారు. యా సంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ ను ఆదివారం నర్మ్టెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా సోమవారం సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. రైతుభరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ. 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తు తం యాసంగి సీజన్‌ కోసం రైతులందరికీ ఎకరానికి రూ. 6 వేల చొప్పున అందిస్తున్నారు. నగదు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు, ఆ సొమ్మును వ్యవసాయ అవసరాలకు ఉ పయోగించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేరిట రైతులకు మెసేజ్‌లు వస్తున్నాయి. జిల్లాలో మంగళవారం సాయం త్రం వరకు 1,52,001 మంది రైతుల ఖాతాల్లో మొదటి వి డతగా రూ. 78 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసా య అధికారి సురేఖ తెలిపారు. రైతులందరికీ ఒక్కో ఎకరా నికి రూ. 6 వేల చొప్పున మొదటి విడతగా జమ అవుతు న్నాయని 45 రోజుల్లో మరో రెండు విడతల్లో పూర్తి నగదు అందుతుందని పేర్కొన్నారు. ఖాతా నంబర్ల తేడాలు, ఆధా ర్‌ లింక్‌ తదితర సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరి ష్కరించి వారికి సైతం నగదు జమ చేయనున్నారు. కొత్త గా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులకు సైతం పె ట్టుబడి సాయం అందిచేందుకు వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కొత్త రైతుల వివరాలు ఆన్‌లైన్‌ చేసిన వెంటనే రైతుభరోసా నిధులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

-కష్టకాలంలో అందిన సాయం..

అతివృష్టి, ప్రతికూల పరిస్థితులతో ఖరీఫ్‌ సీజన్‌ నష్టాలు మిగల్చగా కోటి ఆశలతో రైతులు యాసంగి పనులు ప్రా రంభించారు. వరి, పత్తి పంటల్లో సరైన దిగుబడులు రాక పోవడంతో యాసంగికి పెట్టుబడుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో రైతు భరోసా డబ్బులు చేతికి అందడం సంతోషంగా ఉందని రై తులంటున్నారు. సర్కారు ఇచ్చే పైసలు ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, కూలీల ఖర్చులకు అవసరం అవుతా యని అంటున్నారు. కష్టకాలంలో డబ్బులు రావడంతో పె ట్టుబడి తిప్పలు తప్పాయని అంటున్నారు. మరో రెండు విడతల్లో వచ్చే డబ్బులు అదనకు ఆసరా అవుతాయని రైతులు పేర్కొన్నారు.

-నగదు జమకు కొత్త విధానం

ఈ సారి రైతుభరోసాను ప్రభుత్వం కొత్త విధానాన్ని అ మలు చేస్తోంది. చిన్నా, పెద్ద రైతులకు ఒకే సారి పెట్టుబ డి సాయం అందిస్తున్నారు. గతంలో ఒక ఎకరం భూమి ఉ న్న రైతులతో ప్రారంభించి విడతల వారిగా రెండు, మూ డు ఎకరాలకు పైగా జమ చేసేవారు. ఐదారు విడతల్లో సా యం అందించడాన్ని పూర్తిచేసేవారు. దీంతో సాయం అం దడంలో ఆలస్యం కూడా అయ్యేది. వీటిని అధి గమించేం దుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఎన్ని ఎ కరాలున్నా సరే.. ప్రతి రైతుకు తొలి ఎకరానికి రూ. 6 వే ల చొప్పున జమ చేస్తున్నారు. ఉదాహరణకు ఐదు ఎకరాలు సాగు చేస్తున్న రైతుకు కూడా ఎకరం భూమికి మాత్ర మే పెట్టుబడి సాయం ఇస్తారు. మిగతా 45 రోజుల్లో మరో రెండు విడతల్లో మొత్తం సొమ్ము జమచేస్తారు. అంటే మ రో ఇరవై రోజుల్లో రెండో విడత, 45 రోజుల్లో మూడో విడత నిధులు విడుదల చేస్తారు.

-కొత్తవారికి దరఖాస్తుకు అవకాశం

ఓ వైపు రైతు భరోసా సాయం రైతులకు అందిస్తూనే, కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తున్నా రు. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసిపో నుంది. 2026 ఫిబ్రవరి 28 లోగా కొత్తగా పాసుపుస్తకం పొందిన వారు, ఇప్పటి వరకు రైతుభరోసా రాని అర్హులైన రైతులు, బ్యాంకు వివరాలు నమోదు చేయనివారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్తవారి వివరాలు ఆన్‌ లైన్‌లో నమోదు చేస్తే వారికి కూడా రైతుభరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 24 , 2026 | 10:11 PM