Share News

kumaram bheem asifabad- బాలికల భద్రతకు భరోసా

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:52 PM

విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా బాలికలపై ఇటీవల వేధింపులు, అనుచిత ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో, నిందితుల బెదిరింపులకు భయపడో చాలా మంది పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకు ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ... బాధితుల వివరాలు బయటకు రాకుండా నేరుగా దిల్లీ నుంచే నిందితుల ఆట కట్టించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్‌ ఆయుధాన్ని రంగంలోకి తెచ్చింది. ప్రత్యేక పోర్టల్‌ ద్వారా బాలికలకు భరోసా కల్పిస్తోంది.

kumaram bheem asifabad- బాలికల భద్రతకు భరోసా
లోగో

వాంకిడి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా బాలికలపై ఇటీవల వేధింపులు, అనుచిత ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో, నిందితుల బెదిరింపులకు భయపడో చాలా మంది పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకు ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ... బాధితుల వివరాలు బయటకు రాకుండా నేరుగా దిల్లీ నుంచే నిందితుల ఆట కట్టించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్‌ ఆయుధాన్ని రంగంలోకి తెచ్చింది. ప్రత్యేక పోర్టల్‌ ద్వారా బాలికలకు భరోసా కల్పిస్తోంది.

- ఫిర్యాదు విధానం ఇలా..

బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణలో కేంద్ర ప్రభుత్వం ఠీఠీఠీ.ుఽఛిఞఛిట.జౌఠి.జీుఽ అనే వెబ్‌సైట్‌ను తెచ్చింది. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే హోమ్‌ పేజీపై ఫిర్యాదుల విభాగం కనిపిస్తుంది. ఈ బాల్‌ నిదాన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. సంఘటన వివరాలు, ప్రదేశాన్ని నమోదు చేసి ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు ఉంటే అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి. ఈ పోర్టల్‌లో ఫిర్యాదులపై ఢిల్లీలోని కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షణలో విచారణ సాగుతుంది. ఫిర్యాదులను మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాల యానికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి పంపుతారు. బాలల సంరక్షణ ఆధికారి డీసీపీఓ, సిబ్బంది స్పందించి విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అఽధికారులకు కూడా ఫిర్యాదు ఎవరు చేశారనే వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ప్రథమిక విచారణ అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో కేసు నమోదు చేస్తారు. కేసు పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర బృందానికి పంపాల్సి ఉంటుంది. ఈ విధానం ఫిర్యాదు దారులకు పూర్తి రక్షణ కల్పిస్తూనే, నేరస్థులకు కఠిక శిక్షలు పడేలా దోహదపడుతుంది.

- బాలికలపై నేరాల కట్టిడికి దోహదం

మహేందర్‌ , వాంకిడి ఎస్సై

బాలికలపై నేరాలను కట్టడికి ఈ ప్రత్యేక పోర్టల్‌ దోహదం చేస్తుంది. దీనిపై ప్రధానంగా బాలికలు అవగాహ న పెంచుకోవాలి. వేధింపులకు గురైతే భయపడకుండా పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. బాధితులకు న్యాయం చేసేందుకు యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. బాలికలు ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Aug 29 , 2026 | 11:52 PM