kumaram bheem asifabad- యువతకు ఉపాధి భరోసా
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:05 PM
చదువుకున్నా ఉద్యోగం దొరకక ఇంట్లోనే ఉంటున్న గ్రామీణ యువత భవిష్యత్‌కు భరోసా కల్పించేందు కు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. 18 నుంచి 35 ఏళ్లమధ్య వయసున్న నిరుద్యోగులను గుర్తించి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులు, ఉపాధి అవసరాలను నమోదు చేస్తోంది.
- 18-35 ఏళ్ల నిరుద్యోగులపై సర్కారు దృష్టి
- పంచాయతీ కార్యదర్శుల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): చదువుకున్నా ఉద్యోగం దొరకక ఇంట్లోనే ఉంటున్న గ్రామీణ యువత భవిష్యత్‌కు భరోసా కల్పించేందు కు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. 18 నుంచి 35 ఏళ్లమధ్య వయసున్న నిరుద్యోగులను గుర్తించి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులు, ఉపాధి అవసరాలను నమోదు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యద ర్శుల ద్వారా ఈ వివరాలు సేకరిస్తున్నారు. పలుగ్రా మాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్ నమోదు కూడా జరుగుతోంది. కాగా గ్రామపరిధి లోని చదువుకున్న నిరుద్యోగ యువతను గుర్తించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించా రు. వారి పేరు, తల్లిదండ్రులు లేదా భర్తపేరు, లిం గం, కులం, చిరునామా, జిల్లా, మండలం, గ్రామపం చాయతీ, గ్రామం, ఇంటినంబరు వంటి ప్రాథమిక వివరాలతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉపాధి అవసరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసు న్నారు. దీనివల్ల గ్రామాల వారీగా నిరుద్యోగ యువ తపై సమగ్ర సమాచారం ప్రభుత్వానికి అందు బాటులోకి వస్తుంది. సేకరించిన డేటా ఆదారంగా యువతకు ఏ రంగంలో శిక్షణ అవసరమో, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్లో ఎవరికి స్వయం ఉపాధి పథకాలు ఉపయోగపడతాయో అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
- నైపుణ్య శిక్షణ ద్వారా..
యువతను కేవలం ఉద్యోగాలకే పరిమితం చేయకుండా ఉపాధి కల్పన మార్కెటింగ్, వివిధ ప్రభుత్వ పథకాలు, నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించి వాటికి అనుగుణంగా శిక్షణ అందించి గ్రామీణ ప్రాంతాల్లోని యువతను తమ సొంత గ్రామంలోనే ఉపాధి లబించేలా కార్యాచరణ రుపొందించనున్నారు. కాగా జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసు లైవ్ రిజిస్టర్ ప్రకారం 4,536 మంది ఉద్యోగార్థులుగా నమోదయ్యారు. వీరిలో 19 ఏళ్లలోపు వారు 145 మంది, 20 నుంచి 29 ఏళ్ల వారు 1,850 మంది, 30 నుంచి 39 ఏళ్లవారు 1,950 మంది ఉన్నారు. విద్యార్హతల వారీగా పదో తరగతి ఉత్తీర్ణులు 1,546 మంది, ఇంటర్ 1,245 మంది, గ్రాడ్యువేట్లు 950 మంది ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు కూడా రిజిస్టర్‌లో ఉన్నారు.
వివరాలు సేకరిస్తున్నాం..
- కిరణ్‌కుమార్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత వివ రాలను సేకరిస్తున్నాం. విద్యార్హతలు, నైపు ణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో అర్హులైన యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలి. జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియో గం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలి.