స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు భరోసా
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:37 PM
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు జి.చిన్నారెడ్డి అన్నారు.
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యో తి) : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు జి.చిన్నారెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల తో పేదలకు మరింత ఆహార భరోసా కలుగనుం దన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పా టిల్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డిలతో కలి సి చిన్నారెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా లో 20 మండలాల్లో 2,77,455 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుం బాలకు ఆహార భద్రత కల్పించడంలో రేషన్ వ్యవస్థ కీలకమని, స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ సరుకులతో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్ర యోజనాలకు ఆధారంగా ఉపయోగపడతాయని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ ఆకలి విలువ తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పేదల సంక్షే మానికి ప్రాధాన్యత ఇస్తు న్నారని అన్నారు. సన్న బియ్యం పంపిణీతో పేద లకు ఆహార భద్రత క ల్పిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జి ల్లాలో 2,79,133 రేషన్ కా ర్డుల పరిధిలో 5,99,238 మందికి 552 రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చిన్న గ్రామా లకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని, చెంచు కుటుంబాలకు ఏఏవై కార్డులు మంజూ రు చేయాలని కోరారు. బియ్యం నాణ్యతపై ప్ర త్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతీ కుటుంబానికి సం క్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వ యంతో పని చేయాలని కోరారు. అంతకు ముం దు 11 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.