రైతులకు ‘భరోసా’..
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:16 AM
వానాకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నది. మంగళవారం ఈ సీజనలో ముందస్తుగానే రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడేలా ముందస్తుగానే ప్రభుత్వం సహాయం విడుదల చేస్తున్నది. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఈ సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వానాకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నది. మంగళవారం ఈ సీజనలో ముందస్తుగానే రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడేలా ముందస్తుగానే ప్రభుత్వం సహాయం విడుదల చేస్తున్నది. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఈ సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా రెండురోజుల్లో జిల్లాకు చెందిన 1,30,060 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. దీనికి 67,76,48,815 రూపాయల సహాయం అందింది. జిల్లాలో 2,15,433 మంది రైతులు ఉండగా వీరికి ఉన్న భూమికి గాను ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున 213,75,75,166 రూపాయలు అవసరమవుతాయని భావించారు. వారు సమర్పించిన పట్టాదారు పుస్తకాలు, బ్యాంకు అకౌంట్ అనుసంధానం వివరాల మేరకు 2.9 లక్షల మంది రైతుల వివరాలను ఆనలైనలో వ్యవసాయ విస్తరణ అధికారులు అప్‌డేట్ చేశారు. వీరిలో 1,92,922 మందికి 207,11,13,234 రూపాయలు ట్రెజరీకి పంపించారు. మొదటి రోజు రెండెకరాల వరకు, రెండో రోజు మూడెకరాల భూమి వరకు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బు జమచేశారు. తొమ్మిదిరోజుల్లో మొత్తం మంది రైతులకు నిధులను వారివారి ఖాతాల్లో జమచేస్తారు. వర్షాలు కురిసి ఖరీప్ సాగు పనులు ప్రారంభం కాకముందే రైతు భరోసా సహాయం అందుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.