Government whip AD Srinivas: బయటికెళ్లడానికే గిల్లి పంచాయితీ:ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:43 AM
శాసనసభ నుంచి బయటికెళ్లడానికే గిల్లి పంచాయితీ పెట్టుకుని హరీశ్ రావు బాయ్‌కట్ చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం...
శాసనసభ నుంచి బయటికెళ్లడానికే గిల్లి పంచాయితీ పెట్టుకుని హరీశ్ రావు బాయ్‌కట్ చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం మహాత్మాగాంధీ పేరును తొలగించిన అంశంపై సభలో చర్చ జరిగితే ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తదనే కారణంతో వెళ్లిపోయారా? అని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చీల్చి చెండాడుతాడేమో అని ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూశారని, కానీ చర్చలో పాల్గొంటే తమ అవినీతి ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడి పారిపోయారని ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోంది?: యెన్నం
‘ఓ వైపు కవిత అసెంబ్లీలోనే చర్చ జరగాలని అంటుంది. మరోవైపు హరీశ్‌రావు మైకు ఇవ్వలేదని సెషన్ మొత్తాన్ని బాయ్‌కట్ చేస్తున్నామంటారు. ఇదంతా కేసీఆర్‌కు తెల్వకుండానే జరుగుతోందా? అసలేం జరుగుతోంది కల్వకుంట్ల కుటుంబంలో?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ఆటను.. ఆ ఆటకు సంబంధించిన వేదికల్లోనే ఆడాలని.. అలాగే ప్రజాసమస్యలను అసెంబ్లీలోనే చర్చించాలని వ్యాఖ్యానించారు.