Share News

kumaram bheem asifabad- ఆశ్రమ విద్యాలయం.. అవస్థల నిలయం

ABN , Publish Date - Apr 07 , 2026 | 10:56 PM

భోజనవసతితో పాటు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలపై ఉన్నతాధికారులు నిర్లక్షవైఖరిని అవలంబిస్తుండడంతో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

kumaram bheem asifabad- ఆశ్రమ విద్యాలయం.. అవస్థల నిలయం
చెట్ల కింద భోజనాలు చేస్తున్న విద్యార్థులు

- నల్లా నీటితో సరిపెట్టుకుంటున్న విద్యార్థులు

- చెట్లకింద భోజనాలతో విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

వాంకిడి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గిరిపుత్రులకు భోజనవసతితో పాటు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలపై ఉన్నతాధికారులు నిర్లక్షవైఖరిని అవలంబిస్తుండడంతో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. భోదన పై శ్రద్ధ తీసుకుంటున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విపలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలీచాలని వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి పరిస్థితి నెలకొన్నది. ఆశ్రమ పాఠశాలలకు ఏటా లక్షల నిధులు కేటా యిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య, పర్యవేక్షణలోపం తో సౌకర్యాల కల్పన కొరవడుతోంది. విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా అవి ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. మండలంలోని బంబార గిరిజన ఆశ్రమపాఠశాలలో 186 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో సరిపడా భవన సదుపాయం ఉన్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, డైనింగ్‌హాల్‌ తదితర సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. విద్యార్థులకు తాగునీరు అందించేందుకు గాను రూ. 2.5 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంటు చెడిపోయి అలంకార ప్రాయంగా మారింది. దీంతో విద్యార్థులకు శుద్ధజ లం అందని ద్రాక్షలా తయారైంది. దీంతో ప్రతి రోజు విద్యార్థులు నల్లా నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఏర్పాటు చేసిన సోలార్‌ వేడినీటి యంత్రాలు చెడిపోయి ఏళ్లు కావస్తున్న అధికారు లు మరమ్మతులు చేయడంలేదు. దీంతో విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు.

డైనింగ్‌హాల్‌ లేక అవస్థలు..

పాఠశాలలో డైనింగ్‌హాల్‌ లేకపోవడంతో పాఠశాల అవరణలోని చెట్ల కిందనీడలో విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వంటశాల లేకపోవడంతో వంటకాలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విద్యార్థులకు సరిపడా మరు గుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో ఎనిమిది స్నానపు గదులు 16 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అందులో 4 స్నానపుగదులు, 6 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పాఠశాలలో శుద్ధజలం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మోటర్‌ నీటిని ప్రతి రోజు నేరుగా విద్యార్థులు తాగుతునా ్నరు. దీంతో అంటువ్యాధులు ప్రబలి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఆహారం వికటించి పలువురు విద్యా ర్థినులు అస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యా ర్థిని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇప్ప టికైనా అధికారులు శుద్ధజలం అందించేందుకు చర్య లు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 10:56 PM