నిబంధనల మేరకే యాష్ రవాణా
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:23 PM
ఎస్టీపీపీలో నిబంధనల మేరకే యా ష్ రవాణా జరుగుతుందని ఎస్టీపీపీ జీఎం నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్టీపీపీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జైపూర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ఎస్టీపీపీలో నిబంధనల మేరకే యా ష్ రవాణా జరుగుతుందని ఎస్టీపీపీ జీఎం నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్టీపీపీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాష్ డిస్పోజల్ ప్రక్రియ పూర్తిగా కార్పొరేట్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మినిస్ర్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్, మినిస్ర్టీ ఆఫ్ పవర్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లై యాష్‌ను ఈ ఆక్షన్ ద్వారా టన్నుకు రూ. 10 చొప్పున 2.10 లక్షల టన్నులు డీఆర్‌కే ఎర్త్‌మూవర్స్‌కు కేటాయించామని, మిగిలిన 90 వేల టన్నుల కో సం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ద్వారా (ఈవోఐ) 24 పరిశ్రమలకు అవకా శం కల్పించామన్నారు. ఇందులో శ్రీసాయి ఐఎస్‌బీ బ్రిక్స్, ఎస్‌ఆర్‌ఆర్ బ్రిక్స్ సంస్థలు ముందుకు రావడంతో వారికి యాష్ ఉచితంగా అందిస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు ప్లాంట్‌కు వివిఽధ విభాగాల్లో 53 అవార్డులు లభిం చాయని, ప్లాంట్ అభివృద్ధిని ఓర్వలేని కొందరు వ్యక్తులు సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ అధికారులు మదన్ మోహన్, కిరణ్‌బాబు, స్వామిరాజు, వాసుదేవమూర్తి పాల్గొన్నారు.