Share News

అర్హత లేకున్నా..అందలం

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:21 PM

మునిసిపల్‌ శాఖలో కమిషనర్‌ పోస్టింగుల్లో ఇష్టారాజ్యంగా నడు స్తోంది. అర్హతలు లేకపోయినా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రె వెన్యూ ఆఫీసర్లు, మేనేజర్లకు డిప్యుటేషన్‌ల పేరుతో క మిషనర్‌ పోస్టులు అంటగడుతూ అందలం ఎక్కిస్తు న్నారు.

అర్హత లేకున్నా..అందలం

మేనేజర్లే మునిసిపల్‌ కమిషనర్లు....!

-డిప్యుటేషన్‌పై ఏళ్ల తరబడి కొనసాగింపు

-నిబంధనలకు విరుద్దంగా ఒకేచోట మళ్లీ పోస్టింగ్‌

మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ శాఖలో కమిషనర్‌ పోస్టింగుల్లో ఇష్టారాజ్యంగా నడు స్తోంది. అర్హతలు లేకపోయినా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రె వెన్యూ ఆఫీసర్లు, మేనేజర్లకు డిప్యుటేషన్‌ల పేరుతో క మిషనర్‌ పోస్టులు అంటగడుతూ అందలం ఎక్కిస్తు న్నారు. అన్ని అర్హతలున్న అధికారులకు మాత్రం ప్రాధా నత్యలేని పోస్టులు అప్పగిస్తుండటంతో మునిసిపాలిటీల పాలన అస్తవ్యస్తంగా మారింది. రాజకీయ అండదండ లున్న వారు అర్హతలు లేకపోయినా కమిషనర్లుగా చలా మణి అవుతుండటం మునిసిపల్‌ శాఖలో ఆనవాయి తీ గా వస్తోంది. జిల్లాలోనూ ఇద్దరు అనర్హులకు మునిసి పల్‌ కమిషనర్లుగా పోస్టింగ్‌ ఇవ్వగా, అన్ని అర్హతలున్న ఓ అధికారిని మాత్రం అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియ మించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

మేనేజర్లకు కమిషనర్లుగా పదోన్నతి...

జిల్లాలో పని చేస్తున్న ఇద్దరు మునిసిపల్‌ మేనేజ ర్లకు అక్రమ పద్ధతుల్లో కమిషనర్లుగా పోస్టింగులు వ చ్చాయి. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో కమిషనర్‌గా ఇటీ వల బాధ్యతలు తీసుకున్న మురళీకృష్ణ అసలు పోస్టింగ్‌ జోన్‌-1 భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని ఇల్లందు ముని సిపాలిటీలో రెవెన్యూ అధికారి. 2024 ఫిబ్రవరిలో జోన్‌ -1 కాళేశ్వరం పరిధిలోని క్యాతన్‌పల్లి మునిసిపల్‌ ఇన్‌ చార్జి కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై పోస్టింగ్‌ ఇచ్చారు. అ నంతరం అదే ఏడాది అక్టోబర్‌లో చెన్నూరు మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన అక్కడ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తుండగానే 2025లో గ్రేడ్‌-2 అధికారి అంజయ్యకు మునిసిపల్‌ పరిపాలన విభాగం చెన్నూరు రెగ్యులర్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. అ నూహ్యంగా ఆయన ఆర్డర్‌ రద్దు అయింది. ఇదిలా ఉం డగా 2026 జూన్‌లో టీజీపీఎస్సీ పరీక్షల్లో గ్రూప్‌ -2 అధికారిగా నియమితులైన కోటేశ్వరరావుకు చెన్నూరులో రెగ్యులర్‌ పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ యన కూడా విధుల్లో చేరకుండానే ఆర్డర్‌ క్యాన్సిల్‌ అ యింది. ఇద్దరు అధికారులు విధుల్లో చేరకుండా ఆర్డర్లు రద్దు కావడం వెనుక రాజకీయ పలుకుబడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు రెగ్యులర్‌ అధికారులు వి ధుల్లో చేరకపోవడంతో తిరిగి ఇన్‌చార్జి కమిషనర్‌గా మురళీకృష్ణనే కొనసాగించారు. ఇదిలా ఉండగా చెన్నూ రులో విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణను పది రోజుల క్రితం తిరిగి క్యాతన్‌పల్లి మునిసిపల్‌ కమిషనర్‌గా బది లీ చేశారు. అప్పటి వరకు క్యాతన్‌పల్లి మునిసిపల్‌ కమి షనర్‌గా గ్రేడ్‌-1 అధికారి అయిన మారుతీ ప్రసాద్‌ వి ధులు నిర్వహించగా, ఆయన్ను చెన్నూరు కమిషనర్‌గా బదిలీ చేశారు. ఒకచోట విధులు నిర్వహించిన అధికారి కి తిరిగి పాత స్థానంలోనే పోస్టింగ్‌ ఇవ్వడం నిబంధన లకు విరుద్దం. మరోవైపు ఫండమెంటల్‌ రూల్‌ 49 ప్రకా రం డిప్యుటేషన్‌పై వచ్చిన ఏ అధికారి అయినా గరిష్టం గా ఆరు నెలలకు మించి విధులు నిర్వహించడం సా ధ్యంకాదు. అత్యవసర పరిస్థితుల్లో డిప్యుటేషన్‌పై వచ్చి న వారు తమ ఒరిజినల్‌ క్యాడర్‌ మేరకు మాత్రమే వి ధులు నిర్వహించేందుకు వెసులుబాటు ఉంటుంది. కా గా క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో నిబంధనలకు విరు ద్దంగా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. పైగా రాష్ట్ర పతి ఉత్తర్వులు 2018 ప్రకారం ఒక జోన్‌ పరిధిలోని అ ధికారి మరో జోన్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిం చడం చట్ట విరుద్దం. అలాగే బెల్లంపల్లి మునిసిపాలిటీ లో ఇన్‌చార్జి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌ అసలు క్యాడర్‌ మేనేజర్‌. అతనికి కూడా నిబంధనలకు విరుద్దంగా ఇన్‌చార్జి కమిషనర్‌గా విధులు కేటాయిం చారు. ఇదిలా ఉండగా గతంలో క్యాతన్‌పల్లి మునిసి ప ల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించిన గ్రూప్‌-2 అధి కా రి రాజుకు మంచిర్యాల కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ కమి షనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. అన్ని అర్హతలున్న ఆయన అసిస్టెంట్‌ కమిషనర్‌గా కొనసాగుతుండగా, ఎలాంటి అ ర్హతలు లేని మురళీకృష్ణ, రమేష్‌లు మాత్రం కమిషన ర్లుగా విధులు వెలగబెడుతుండటం గమనార్హం. వీరి కా రణంగా అర్హులైన మునిసిపల్‌ కమిషనర్లకు పోస్టింగ్‌ దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రాజకీయ అండదండలతోనే...

అర్హత లేకున్నా ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమితు లు కావడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలతో పోస్టింగులు కొడుతున్న అనర్హులు తమ సీట్లను వదలకుండా ఏళ్ల తరబడి తిష్టవే యడం గమనార్హం. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ లేఖలు అర్హత ఉన్నవారికే అందుతున్నాయా...? లేదా అ న్న విషయంపై దృష్టి సారించాలన్న విజ్ఞప్తులు ఉన్నా యి. ఇదిలా ఉండగా ఇన్‌చార్జి కమిషనర్లుగా విధులు ని ర్వహిస్తున్న అఽధికారులు మునిసిపాలిటీలలో తమ సొం త రూల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులను కాదని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బం ది కి ప్రాధాన్యం ఇస్తుండటంతో పాలన అస్తవ్యస్తంగా త యారైందన్న ప్రచారం జరుగుతోంది. క్యాతన్‌పల్లి ముని సిపాలిటీలో రెగ్యులర్‌ ఉద్యోగులు ఉదయం 7.30కి విధు ల్లో చేరి తిరిగి సాయంత్రం 6.30కి ముగిస్తున్నారు. అ లా వారంతా ఏకదాటిగా 11 గంటలపాటు విధులు ని ర్వహించాల్సి రావడంతో అనేక ఇబ్బందులు పడుతు న్నారు. రివ్యూ మీటింగ్‌లతో కార్యాలయానికి పరిమితం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమయపాలన లే ని విధుల కారణంగా ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గు రవుతుండగా, తమ కుటుంబాలకు సమయం వెచ్చించ లేకపోతున్నామనే భావనలో ఉన్నారు. మరోవైపు రెగ్యు లర్‌ కమిషనర్లను అడ్డుకొని ఇన్‌చార్జిగా పోస్టుల్లో కొన సాగుతున్న వారు మునిసిపాలిటీల అభివృద్ధికి చేసిందే మీలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో కంటే అ త్యంత ధీన పరిస్థితుల్లో మునిసిపాలిటీలు కొట్టు మి ట్టాడుతున్నాయన్న ప్రచారం జరగుతోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు అక్రమ పోస్టింగులపై ధృష్టిసా రించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:21 PM