Share News

ట్రంప్‌ మీకు పెద్దనాన్న.. అందుకే నోరువిప్పేందుకు భయం: అసద్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:49 AM

ట్రంప్‌ మీకు పెద్దనాన్న. దేశానికి జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పేందుకు మీకు భయం వేస్తుంది. దేశ ఆతిథ్యంపై విశాఖకు ప్రదర్శన కోసం వచ్చిన నిరాయుధ ఇరాన్‌ నౌకను...

ట్రంప్‌ మీకు పెద్దనాన్న.. అందుకే నోరువిప్పేందుకు భయం: అసద్‌

హైదరాబాద్‌/చార్మినార్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ట్రంప్‌ మీకు పెద్దనాన్న. దేశానికి జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పేందుకు మీకు భయం వేస్తుంది. దేశ ఆతిథ్యంపై విశాఖకు ప్రదర్శన కోసం వచ్చిన నిరాయుధ ఇరాన్‌ నౌకను భారతీయ జలాల్లో అమెరికా టోర్పడోతో పేల్చితే నోరు మెదపరెందుకు..?ఇరాన్‌ యుద్ధంపై ఇప్పటికైనా మౌనం వీడండి. ఏ దేశం నుంచి చమురు కొనాలో అమెరికా చెబుతుందా...?’’ అని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో యౌముల్‌ ఖురాన్‌(ఖురాన్‌ దినం) సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ మాట్లాడారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగితే పశ్చిమాసియాలోని కోటి మంది భారతీయుల ఉపాధిపై ప్రభావం పడుతుందని, అమెరికా తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి పంపిస్తున్నది పశ్చిమాసియాలో ఉన్న భారతీయులేననే విషయాన్ని గుర్తించాలన్నారు. వెంటనే ప్రధాని మోదీ ట్రంప్‌కు ఫోన్‌ చేసి, యుద్ధాన్ని ఆపేయాలని కోరాలన్నారు. యుద్ధం వల్ల అమెరికాకు కలిగే నష్టం ఏమీ లేదని, అంతిమంగా భారతదేశంపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 04:50 AM