kumaram bheem asifabad- సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుండాలి
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:10 PM
సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుండాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బెజ్జూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుండాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్యవైశ్యులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకోసం తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం జిల్లా అద్యక్షుడు రాచకొండ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమ సంఘం ఆద్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పేద ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు స్థానికంగానే వైద్యం అందాలన్న ఉద్దేశంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలోనే జిల్లాలోని రాచకొండ బలగం ఆద్వర్యంలో మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా బస్టాండ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జాతీయ మహిళా కార్యదర్శి అదిత, ఎస్సై సర్తాజ్‌పాషాలను ఆర్యవైశ్య సంఘం నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అద్యక్షురాలు కొలిపాక పూజ, ఉపాద్యక్షులు గజ్జల జయలక్ష్మి, కార్యదర్శులు కొడిప్యాక సాధన, పుల్లూరి శారద, యాంసాని నీలిమ, కార్యవర్గ సభ్యులు రాచకొండ సారిక, తూడూరు సాయిష్మ, ఎస్సై సర్తాజ్‌పాషా, సర్పంచులు సరోజ, శంకర్, ఉపసర్పంచ్ ఆదర్శ్, వాసవి క్లబ్ అద్యకుడు రాచకొండ శ్రీవర్దన్, గౌరవ అద్యక్షుడు చంద్రశేఖర్, రంగనాయక ఆలయ కమిటి అధ్యక్షుడు తంగడిపల్లి మహేష్, సంఘం నాయకులు పుల్లూరి మదూకర్, రాచకొండ కృష్ణ, వైద్యులు డాక్టర్ అంకిత్, శాంతన్ తదితరులు ఉన్నారు. కాగా మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరానికి స్పందన లభించింది. ఈ శిబిరంలో వైద్యులు అంకిత్, శాంతన్‌లు వివిద గ్రామాలకు చెందిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శిబిరానికి సుమారు 300లకు పైగా రోగులకు వైద్య సేవలందించారు. ఎల్కపల్లి, కుశ్నపల్లి, నాగుల్వాయి, చిన్నసిద్దాపూర్, రేచిని, ఇందుర్‌గాం తదితర గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందారు.