రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంపునకు పంజాబ్ నమూనా
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:45 AM
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంపునకు పంజాబ్ నమూనాలను పరిశీలించాలని ఆర్థిక వేత్త, సలహాదారు అరవింద్ సుబ్రమణియన్..
మంత్రి పొంగులేటికి సలహాదారు అరవింద్ సూచన
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్ర జ్యోతి): రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంపునకు పంజాబ్ నమూనాలను పరిశీలించాలని ఆర్థిక వేత్త, సలహాదారు అరవింద్ సుబ్రమణియన్.. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు అరవింద్ సుబ్రమణియన్ మంగళవారం ఉదయం మంత్రి పొంగులేటితో సమావేశమయ్యారు. తమిళనాడు, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి.. మార్కెట్ విలువల సవరణపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని తన బృందంతో సమన్వయం చేసుకుని.. ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలపై అధ్యయనం చేయాలని మంత్రిని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఽవిలువలను 15 నుంచి 20 శాతం వరకు పెంచితే ఎలా ఉంటుందనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.