Share News

ఆర్టిజన్‌ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:31 PM

దండేపల్లి సెక్షన్‌లో పని చేస్తున్న ఆర్టిజన్స్‌ కార్మికుడు రాజేందర్‌ అనారోగ్యంతో రెండు కళ్లు పూర్తిగా పని చేయ డం లేదని అధికారులు స్పందించి రాజేందర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వెర్షన్‌ జేఏసీ చైర్మన్‌ పసుల తిరుపతి అన్నారు.

ఆర్టిజన్‌ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి
ఎస్‌ఈ రాజన్నకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్టిజన్‌ జేఏసీ నాయకులు

మంచిర్యాలక్రైం, జూలై10 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి సెక్షన్‌లో పని చేస్తున్న ఆర్టిజన్స్‌ కార్మికుడు రాజేందర్‌ అనారోగ్యంతో రెండు కళ్లు పూర్తిగా పని చేయ డం లేదని అధికారులు స్పందించి రాజేందర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వెర్షన్‌ జేఏసీ చైర్మన్‌ పసుల తిరుపతి అన్నారు. శుక్రవారం ఎస్‌ఈతో పాటు డీఈకి వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి ఉద్యో గం అందించాలని, అలాగే ఆర్టిజన్స్‌ సమస్యలను పరిష్కరించాలని రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇప్పించాలని ఆన్‌లైన్‌ అటెండెంట్స్‌ ఆర్టిజన్స్‌కు సంబంధిత సెక్ష న్‌లో అడుగుతున్నారని ఎస్‌ఎస్‌ దూరంగా ఉండడం వల్ల మ్యాన్‌ పవర్‌ త క్కువగా ఉందన్నారు. ఆర్టిజన్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం వెంకటేశ్‌, నరేశ్‌, నగేశ్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:31 PM