kumaram bheem asifabad- భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:19 PM
జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరుగనున్న జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని బుధవారం బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో గల కార్యనిర్వహక అధికారి కార్యాలయంలో జాతర మహోత్సవ నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జిల్లా ఎస్‌పీ నితికా పంత్, అదనపు ఎస్‌పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, దేవాలయ శాఖ అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రెబ్బెన, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరుగనున్న జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని బుధవారం బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో గల కార్యనిర్వహక అధికారి కార్యాలయంలో జాతర మహోత్సవ నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జిల్లా ఎస్‌పీ నితికా పంత్, అదనపు ఎస్‌పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, దేవాలయ శాఖ అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాఆ్లడుతూ ఈ నెల 31 నుంచి పిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేందుకు వరుస క్రమంలోవెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరకు ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, జాతరకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పార్కింగ్ స్థలం, దుకాణ సముదాయాలు క్రమ పద్ధతిలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రెబ్బెన నుంచి గంగాపూర్ వరకు రహదారిపై దుమ్ము లేవకుండా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జాతరలో విద్యుత్ కోత లేకుండా విద్యుత్ శాఖాధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జాతరలో తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు భక్తుల సౌకర్యార్థం బస్సులు నడపాలని, జాతరకు వచ్చే భక్తులకు పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. సింగరేణి అధికారులు జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, జాతరలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైదయ శిబిరాలు ఏరాపటు చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు. జాతర విజయంతం చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాష్, ఎంపీడీవో శంకరమ్మ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్, దేవాదాయ శాఖల అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.