kumaram bheem asifabad- పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:59 PM
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లాలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులకు పరీక్ష నిర్వహణపై గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లాలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులకు పరీక్ష నిర్వహణపై గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించనున్నామని తెలిపారరు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో క్రమ శిణ, సమయ పాలన, తప్పని సరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్‌కు పదో తరగతి తొలి మెట్టు అని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇప్పటి నుంచే మంచి అటవాట్లతో పాటు ఉత్తమ నడవడికను కలిగి ఉండి విద్యలో రాణించి భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో ఉండాలంటే క్రమ శిక్షణ కలిగి ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నంలో మన పూర్వపు ఫలితాలను అదిగమించి ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా అగ్రస్థానం చేరవచ్చని అన్నారు. సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్ జనార్దన్, సహాయ సంచాలకులు సచ్చిదానందచారి, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.