Share News

kumaram bheem asifabad- పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 10:47 PM

పదో తరగతి పరీక్షలకు ఏఆ్పట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి విద్య, వైద్య, మిషన్‌ భగీరథ, పంచాయతీ రాజ్‌, ఖజానా, తపాలా, రవాణా, విద్యుత్‌, ఆర్టీసీ, సంక్షేమ శాఖాధికారులతో వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు ఏఆ్పట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి విద్య, వైద్య, మిషన్‌ భగీరథ, పంచాయతీ రాజ్‌, ఖజానా, తపాలా, రవాణా, విద్యుత్‌, ఆర్టీసీ, సంక్షేమ శాఖాధికారులతో వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు జరుగనున్నాయని ఇందు కొరకు జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి శాఖఅధికారులు, పర్యవేక్షణ అధికారి, సిట్టింగ్‌ స్కాడ్‌లు ఉంఆరని ప్రశ్నా పత్రాలు పోలీసు స్టేషన్‌లో భద్ర పర్చాలని, బందో బస్తు మధ్య కేంద్రాలను తరలించాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కమీషనర్‌ జనార్థన్‌గౌడ్‌, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, డీపీవవో భిక్షపతి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉత్తంజాడే, నీటి పారుదల శాఖ ఈఈ సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల పరిధిలో దుకాణాలు మూసి ఉంచాలి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పరీక్ష కేంద్రాల పరిధిలో దుకాణాలు మూసి ఉంచాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. స్థానికంగా మంగళవారం ఆమె మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నామని చెప్పారు. ఇందు కోసం 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, పారిశుధ్యం, ఫర్నీచర్‌, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ 163, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో జిరాక్స్‌, ఇంటర్నెట్‌ షాపులు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

సిబ్బంది సమయపాలన పాటించాలి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని కలెక్టర్‌ కె హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు సమయ పాలన పాటించారా అని ముఖ్య ప్రణాళిక అధికారిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయ పాలనపాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

Updated Date - Feb 24 , 2026 | 10:47 PM