municipal elections : మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:39 AM
మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ జారీచేసినా సిద్ధంగా ఉండాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని
నల్లగొండ టౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ జారీచేసినా సిద్ధంగా ఉండాలన్నారు. అఖిలపక్ష ప్రతినిధుల నుంచి తీసుకున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ఓటరు జాబితా ప్రకటించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఓటరు జాబితాలో ఫొటోలు రావాలని కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారని వివరించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బందికి శిక్షణ తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.