kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:10 PM
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ, సహకార శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి మనోహర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజితతో కలిసి అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు
ఆసిపాబాద్‌రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ, సహకార శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి మనోహర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజితతో కలిసి అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలు, సహకార శాఖ ఆధ్వర్యంలో 19 కొనుగోల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాసంగి వరి ధాన్యం క్వింటాలుకు రూ.2369 మద్దతు ధర, సన్నరకం వరి ధాన్యంకు రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాలు విశాల ప్రవేశంలో ఉండేలా కొనుగలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు, వెలుతురు, టార్పాలిన్ కవర్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉండేలా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వరి ధాన్యం కోతలు మొదలైందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా ఓపీఎంఎస్ విధానంలో ఉంటుంద న్నారు. రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించి మద్దతు ధర పొందాలే అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మనోహర్, సెర్ప్, సహకార అధికారులు, సెంటర్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.