Share News

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:51 PM

జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబందించిన వరి ధాన్యం కొనుగోలుకు ముందస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధితశాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు.

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబందించిన వరి ధాన్యం కొనుగోలుకు ముందస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధితశాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలో ధాన్యం నిలువలకు అవసరమైన గోదాంలను వెంటనే గుర్తించి సిద్ధంగా ఉండాలని సూచించారు. సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అక్టోబరు 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం సంబందిత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అందులో కేటాయించిన 16 ప్రశ్నలకు సంబంధించిన నిజసమయం తెలిపే ఫొటోలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. గతసీజన్‌కు సంబంధించిన లెక్కలు పూర్తిగా సరిచేసిన తర్వాతే తదుపరి సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని కలెక్టర్‌ చెప్పారు. వాహన వివరాలు, గని సంచుల నిలువ, ధాన్యం రవాణాచేసే లారీలకు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్‌డీవో దత్తారావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

ఆసిఫాబాద్‌,(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణణకు ప్రతీఒక్కరు పాటుపడాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజలు రసాయనాలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారయ్యే విగ్రహలకు బదులుగా పర్యావరణ హీతమైన మట్టి గణపతులను ప్రతిష్టించి నిమజ్జన సమయంలో నీటి వనరులు కలుషితం కాకుండా చూడలన్నారు. పర్యావరణ హీతమైన పద్దతులను పాటించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్‌ అధికారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 10:51 PM