kumaram bheem asifabad- పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:10 PM
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమానులు, సీసీఐ అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమానులు, సీసీఐ అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 సీజన్ పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 3.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, 26.44 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర రూ.8667 ప్రకటించిందని తెలిపారు. ఆయా జిన్నింగ్ మిల్లుల యాజమానులు, మిల్లులో రక్షణ చర్యలు చేపట్టాలని అన్ని ఏర్పాట్లు అధికారులు తనిఖీలు చేసి స్పష్టమైన నివేదికలను సమర్పించాలన్నారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎడీఈ అశ్వక్ అహ్మద్, డీఎఓ వెంకటి, విద్యుత్ శాఖ ఎస్.ఇ ఉత్తం జాడేతో పాటు తదితరులు పాల్గొన్నారు