kumaram bheem asifabad-తొలి విడత జనగణనకు ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:05 PM
జిల్లాలో మొదటి విడత జనగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మే 11 నుంచి జిల్లా వ్యాప్తంగా జనాభ గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి విడత జనగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మే 11 నుంచి జిల్లా వ్యాప్తంగా జనాభ గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన అవకాశం కల్పించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యవం తులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సాధారణ ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు హెచ్‌టీటీపీఎస్..//ఎస్‌ఈ.సెన్సెస్.జీవోవీ.ఇన్ పోర్టల్‌లో లాగిన్ అయి సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1,689 ఇళ్ల బ్లాకులను గుర్తించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు 994 మంది ఎన్యూమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లను నియమించామని వివరించారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. స్వీయ గణన విదానం అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.