Share News

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - May 02 , 2026 | 10:30 PM

జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యటన త్వరలో ఉన్నందున పూర్తి స్థాయి ఏర్పాట్లకు సిద్దంగా ఉండాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై శనివారం అధికారులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యటన త్వరలో ఉన్నందున పూర్తి స్థాయి ఏర్పాట్లకు సిద్దంగా ఉండాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై శనివారం అధికారులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలో సీఎం పర్యటన కౌటాల మండలం తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజి నిర్మాణ ప్రాంతానికి పర్యటించే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లకు సిద్దంగా ఉండాలన్నారు. హెలిప్యాడ్‌, బారికేడ్‌లు, వేది, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ, అధికారుల పాసులు, మీడియా పాసులు, పారిశుధ్య పనులు, తాగునీరు, వీఐపీ, వీవీఐపీలకు తాగునీరు, అల్ఫాహారం, భోజనాలు, ప్రజలకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు, వేదిక, అలంకరణ, మెడికల్‌ సిబ్బంది క్యాంపులతో సిద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, పర్యటన ఎలాంటి లోపాటు జరగకుండా ఏర్పాట్లను సిద్దం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని 15-18 సంవత్సరాల లోపు వయస్సగల బాలికలు స్నేహా వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ భవనంలోని సమావేశ మందిరంలో మే 2 నుంచి జూన్‌ 10 వరకు కౌమార బాలికలు 15-18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు స్నేహా వేసవి శిబిరాల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ, క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పన నిర్మాణాత్మక శిక్షణ ప్రణాళిక అమలుపై శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మార్మాట్‌తో కలిసి కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 15-18 సంవత్సరాల లోపు బాలికలకు మండల స్థాయిలో స్నేహ వేసవి శిబిరాలు ఈ నెల నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించాలన్నారు. ఈ శిబిరంలో వేసవి కాలంలో విద్యా కొనసాగింపు, ఆరోగ్య సేవల సమన్వయం, భద్రత అవగాహన, జీవన నైపుణ్యాలు, బాల్య వివాహాల నివారణ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. మే 2 నుంచి జూన్‌ 10 వరకు రోజు వారి కార్యక్రమాలు ఒకరికొకరు తెలుసుకోవడం, బాల్య వివాహాల నిరోధం, ఆరోగ్య మేళా అవగాహన, వ్యక్తిగత అవసరాలు, సవాళ్లు, సురక్షిత గ్రామ ప్రణాళిక, సురక్షిత గ్రామం, సమాజంతో సంభాషణ, ఆర్థిక అవగాహన, శారీరక దారుడ్యం, ఆటలు, విద్యా, కేరీర్‌, మార్గదర్శనం, సైబర్‌ భద్రత, స్వతంత్ర ప్రమాణానికై బాలికల శక్తి వంటి కార్యక్రమాలు చేపట్టి బాలికల మనోధైర్యం పెంచేలా శిక్షణ అందించాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి వేసవి శిబిరాలను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రమాదేవి, జిల్లా వైద్యాధికారి సీతారాం, డీఎల్‌పీఓ ఉమర్‌ హుస్సేన్‌, డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 10:30 PM