Share News

kumaram bheem asifabad-ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 31 , 2026 | 11:13 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యట నకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ సమావేశంలో ఆదివారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, యువరాజ్‌ మర్మాట్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా డీఆర్‌వో వేణు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad-ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యట నకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ సమావేశంలో ఆదివారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, యువరాజ్‌ మర్మాట్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా డీఆర్‌వో వేణు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కెరమెరి మండలం కోటారి గ్రామ పంచయాతీలోని కొత్తగూడ గ్రామంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతదరం గిరిజనులు, గ్రామ పటేళ్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. సీఎం పర్యటనకు వచేచ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అంబులెక్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌ వద్ద బహిరంగ సభ ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు భారీ బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా సంబంధిత శాఖల సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 11:13 PM