Share News

కుంభమేళా తరహాలో పుష్కరాలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:29 PM

2027లో జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తెలిపారు. దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్ద రూ 9.5 కోట్ల ఎండోమెంట్‌ నిధులతో మంగళవారం పుష్కరఘాట్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దంపతులు కలిసి భూమి పూజ చేసి పనులను ప్రా రంభించారు.

కుంభమేళా తరహాలో పుష్కరాలకు ఏర్పాట్లు
గూడెం గోదావరి నది పుష్కరఘాట్‌ ప్రదేశాన్ని నాయకులు అధికారులతో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

దండేపల్లి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): 2027లో జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తెలిపారు. దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్ద రూ 9.5 కోట్ల ఎండోమెంట్‌ నిధులతో మంగళవారం పుష్కరఘాట్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దంపతులు కలిసి భూమి పూజ చేసి పనులను ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. గూడెం ఆలయం, గో దావరి ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. పుష్క రఘాట్‌ నిర్మాణంలో గూడెం గోదావరి ప్రాంతం మరింత అభివృద్ధి చెంద డంతో పాటు ఫుష్కరాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందు బాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, గూడెం గుట్ట ఆలయ ఈవో శ్రీనివాస్‌, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్‌ శ్రీనివాస్‌, లక్షెట్టిపే ట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్ల, సింగిల్‌ విండో ఛైర్మన్లు శ్రీని వాస్‌, బానే్‌ష్‌, నాగభూషణం, ఆర్‌జీపిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:29 PM