Share News

kumaram bheem asifabad-ఆరోగ్య కార్డు నవీకరణకు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:44 PM

సింగరేణిలోని రిటైర్డ్‌ కార్మికులకు ఆరోగ్య కార్డు నవీకరణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగా ఈసారి కూడా మాజీ ఉద్యోగి, జీవిత భాగస్వామి ఇద్దరు జీవన ప్రతాలను ఎదైనా ప్రభుత్వ కార్యాలయంలో, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌, మీ సేవ, బ్యాంకు బ్రాంచిలో బయోమెట్రిక్‌ ఇచ్చిపునరుద్ధరణ(రెన్యువల్‌) చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

kumaram bheem asifabad-ఆరోగ్య కార్డు నవీకరణకు ఏర్పాట్లు
లోగో

రెబ్బెన, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని రిటైర్డ్‌ కార్మికులకు ఆరోగ్య కార్డు నవీకరణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగా ఈసారి కూడా మాజీ ఉద్యోగి, జీవిత భాగస్వామి ఇద్దరు జీవన ప్రతాలను ఎదైనా ప్రభుత్వ కార్యాలయంలో, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌, మీ సేవ, బ్యాంకు బ్రాంచిలో బయోమెట్రిక్‌ ఇచ్చిపునరుద్ధరణ(రెన్యువల్‌) చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సింగరేణిలో పని చేసే సమయంలో ఉద్యోగి అనారోగ్యానికి గురైతే యాజమాన్యమే కార్పొరేట్‌ ఆసుపత్రికి పంపించి వైద్యం అందిస్తోంది. విరమణ తర్వాత ఆ వెసులుబాటు ఉండదు. కాని వాసరుడు ఉద్యోగంలో చేరి ఉంటే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య పరంగా అందుకోవడనికి సింగరేణి కంపెనీ 2018లో సీపీఆర్‌ఎం(కాంట్రిబ్యూటరీ పోస్టు రిటర్నమెంటు మెడికల్‌ స్కీం) ప్రవేశపెట్టింది. సీపీఆర్‌ఎం కార్డు పొందాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కార్డుతో విశ్రాంత ఉద్యోగులు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం పొందవచ్చు. ఇప్పటి వరకు సింగరేణిలో 46,431 మంది విశ్రాంత ఉద్యోగులు కార్డులు పొందారు.

- సీపీఆర్‌ఎం పథకం

సింగరేణిలో సీపీఆర్‌ఎం పథకం 2018 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. తొలుత ఆరో వేజ్‌ బోర్డు, అంతకంటే ముందున్న వారికి (విరమణ పొందిన ఉద్యోగి) సీపీఎంఆర్‌ కార్డు పొందాలంటే రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల వైద్య ఖర్చు కోసం పొందే అవకాశం ఉండేది. ఆ స్కీం భార్యభర్తలకు వర్తిస్తుండడంతో పాటు భర్తకు రూ.2.50 లక్షలు, భార్యకు రూ.2.50 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేది. 2018లో 9వ వేజ్‌ బోర్డులో డబ్బులు చెల్లింపు, వైద్య ఖర్చు కోసం కేటాయించే డబ్బులు రెట్టింపు చేశారు. రూ.40 వేలు చెల్లిస్తే రూ.8లక్షల వరకు వైద్య ఖర్చు పొందే అవకాశం కల్పించింది. 10, 11 వేజ్‌ బోర్డులో కూడా కొనసాగుతోంది. 2018 అక్టోబరు 26 వరకు విశ్రాంత ఉద్యోగులకు జారీ చేసిన కార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి ఏరియాలో 1,557, మందమర్రి ఏరియాలో 6,028, శ్రీరాంపూర్‌ ఏరియాలో 9,792, సింగరేణి అధికారులు 2,211 మందికి కార్డులు జారీ చేశారు.

బయోమెట్రిక్‌ ఇవ్వాలి..

-ఎం శ్రీరమేశ్‌, బెల్లంపల్లి ఏరియా జీఎం

ఆరోగ్య కార్డులు పొందిన విశ్రాంత ఉద్యోగులు ఈ నెలలో ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌ మీ సేవ బ్యాంకు బ్రాంచ్‌లో బయోమెట్రిక్‌ ఇవ్వాలి. లేకుంటే పథకం రద్దయ్యేఅవకాశం ఉంటుంది. బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటి వరకు 1,557 కార్డులు అందించాం.

Updated Date - Nov 25 , 2026 | 10:44 PM