ఇంటర్, ‘పది’ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:16 PM
నేటి నుంచి ఇంటర్మీడియట్, వచ్చే నెల 14 నుం చి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీ క్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలి పారు.
- విద్య, ఇతర శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : నేటి నుంచి ఇంటర్మీడియట్, వచ్చే నెల 14 నుం చి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీ క్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలి పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యం త్రాంగం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్లు కలె క్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావుకు తెలిపారు. మంగళవారం సీఎస్ హైదరాబాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జి ల్లాల కలెక్టర్లతో టెన్త్, ఇంటర్ పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో సమావేశ మందిరం నుంచి అదన పుకలెక్టర్లు పి.అమరేం దర్, దేవసహాయం, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సిం గ్‌జీ పాటిల్, సంబంధిత శాఖల అధికారు లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్మీడి యట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, 15,173మంది విద్యార్థులు హాజరుకానున్నారని వి వరించారు. మార్చి 14 నుంచి ప్రా రంభమై ఏప్రిల్ 16వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు మొత్తం 10,683 మంది విద్యార్థులు హాజర వు తారని తెలిపారు. పరీక్షా కేంద్రా ల్లో తగిన మౌలిక వసతులు, తాగునీరు, విద్యు త్, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించామని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈవో రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంక టరమణ, డీఎంహెచ్‌వో రవికుమార్, ముని సిపల్ కమిషనర్లు, విద్యాశాఖ సెక్టోరల్ అధికా రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారుల పాత్ర అత్యంత కీలకం
నాగర్‌కర్నూల్, (ఆంధ్రజ్యోతి) : జిల్లా అభివృద్దితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథ కాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి చేరాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పాత్ర అత్యం తక కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అ న్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరం డైరీని కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో మంగళ వారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అమరేం దర్, దేవసహాయలంతో కలిసి కలెక్టర్ ఆవిష్క రించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీజీవో డైరీలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఎంతో అవస రమైన సమాచారం పొందుపర్చడం అభినందనీ యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు పి.రాజశేఖర్, పి.సంజీవ, అసోసి యేషన్ అధ్యక్షుడు ఎండీ ఖాజామైనుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వర్‌రావు, ట్రెజరర్ కే.రాజు, జాయింట్ సెక్రటరీలు లలిత, అశోక్, రామకృష్ణ గౌడ్, హరికృష్ణ పాల్గొన్నారు.