Share News

అర్కాల ఇన్‌ఫ్రాకు రూ.22.41 లక్షల ఫైన్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:45 AM

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండానే ముందస్తు ప్రకటనలిచ్చిన అర్కాల రియాలిటీ ఇన్‌ఫ్రా సంస్థపై భారీ జరిమానా పడింది.

అర్కాల ఇన్‌ఫ్రాకు రూ.22.41 లక్షల ఫైన్‌

  • రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రకటనలిచ్చినందుకే..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండానే ముందస్తు ప్రకటనలిచ్చిన అర్కాల రియాలిటీ ఇన్‌ఫ్రా సంస్థపై భారీ జరిమానా పడింది. రూ.22,41,525 జరిమానాను విధించినట్లు రెరా అథారిటీ తెలిపింది. తమ రిజిస్ట్రేషన్‌ లేకుండానే కొనుగోలుదారులను తప్పుదారి పట్టించేలా సోషల్‌ మీడియాలో ప్రకటనలిచ్చినందుకు చర్యలు తీసుకున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2016 రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు, 8 యూనిట్లకు మించి ఏ ప్రాజెక్టు అయినా రెరా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని.. రిజిస్ట్రేషన్‌ నంబరు పొందకముందే ప్రకటనలివ్వడం, మార్కెటింగ్‌ చేయడం, బుకింగ్‌లు తీసుకోవడం, కొనుగోలుదారులను ఆహ్వా నించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

Updated Date - Feb 24 , 2026 | 05:45 AM