Share News

kumaram bheem asifabad- బడి బస్సులు భద్రమేనా?

ABN , Publish Date - Jun 07 , 2026 | 10:12 PM

జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే లోగా ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా రోడ్డెక్కితే సీజ్‌ చేసేందుకు ఆర్టీఏ అధికారులు సమాయ త్తమవుతున్నారు. జూన్‌ 12 నుంచి జిల్లాలో పాఠశా లలు ప్రారంభం కానున్నాయి. కానీ చాలా పాఠశాలల యాజమాన్యాలు కండిషన్‌ లేని బస్సులను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు

kumaram bheem asifabad- బడి బస్సులు భద్రమేనా?
బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ అధికారులు(ఫైల్‌)

- స్పెషల్‌ డ్రైవ్‌పై దృష్టి సారించిన ఆర్టీఏ అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే లోగా ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా రోడ్డెక్కితే సీజ్‌ చేసేందుకు ఆర్టీఏ అధికారులు సమాయ త్తమవుతున్నారు. జూన్‌ 12 నుంచి జిల్లాలో పాఠశా లలు ప్రారంభం కానున్నాయి. కానీ చాలా పాఠశాలల యాజమాన్యాలు కండిషన్‌ లేని బస్సులను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ బస్సులను కండిషన్‌ చేయించుకొని సిద్దంగా ఉంచుకొవాల్సి ఉంది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమానులు బస్సులను ఫిట్‌నెస్‌ చేయించుకొకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్లపై తిప్పకూ డదు. అయితే వీటిని మారుమూల ప్రాంతాలలో నడిపిస్తున్నట్లు తెలిసింది.

- అనుభవం లేని డ్రైవర్లతో..

ప్రైవేటు విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ లేకపోవడంతో పాటు అనుభవంలేని డ్రైవర్లను తక్కువ వేతనంతో నియమించడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. రోడ్డు రవాణాశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టేందుకు సమయాత్తమవుతున్నారు. జిల్లా లో మొత్తం 89 స్కూల్‌ బస్సులు ఉండగా 52 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ ఉందని ఫిట్‌నెస్‌ లేని బస్సులు 37 వరకు ఉన్నాయి. మరో వారంరోజుల్లో పాఠశాలలు ప్రారంభకానున్న నేపథ్యంలో యాజమాన్యాలు కొత్త బస్సుల కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొంత మంది పాత బస్సులను కొనుగోలు చేసి నడిపే అవకాశం ఉన్నా దీన్ని దృష్టిలో ఆర్టీఏ అదికారు లు ప్రత్యేక దృష్టా సారించారు. ప్రైవేటు పాఠశాలలు ఏటా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు సంబందిత పాఠశాలల యాజమానులకు సమాచారం ఇచ్చారు. జూన్‌ 12లోగా ఫిట్‌నెస్‌ చేయించుకో వాలని లేని పక్షంలో 12 తర్వాత బస్సులను సీజ్‌ చేసి సంబందిత యాజమానులపై చర్యలు తీసుకొనున్నారు.

నిబంధనలు ఇలా..

- స్కూల్‌ బస్సుకు తప్పనిసరిగా పసుపురంగు వేయించి నాలుగు వైపుల పాఠశాల పేరు స్పష్టంగా రాయించాలి.

- డ్రైవర్‌కు కనీసం నాలుగేళ్ల అనుభవం, హేవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. డ్రైవర్‌ వివరాలను రవాణాశాఖకు అందించాలి. అలాగే యూనిఫాం ను కచ్చితంగా ధరించాలి.

- బస్సులు, విద్యార్థులను తరలించే ఏ వాహనంలోనైనా పరిమితికి మించి విద్యార్థుల ను ఎక్కించరాదు. మూడు నెలలకోసారి డ్రైవర్‌కు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.

- విండ్‌ స్ర్కీన్‌, వైపర్‌, లైటింగ్‌, మెకానికల్‌ కండిషన్‌ క్రమం తప్పకుండా తనిఖీ చేసి రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

- పాఠశాల ప్రాంగణంలో పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి.

- పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సులో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలి.

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌..

-మసూద్‌ఆలీ, జిల్లా రవాణాశాఖ అధికారి

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పాఠశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి. ఫిట్‌నెస్‌ లేని బస్సులను నడిపితే నిబంధనల మేరకు సీజ్‌ చేసి చర్యలు తీసుకుంటాం. 15 ఏళ్లు దాటిన, కాలం చెల్లిన బస్సులు రోడ్డు ఎక్కి తే తనిఖీ చేసి సీజ్‌ చేస్తాం.

Updated Date - Jun 07 , 2026 | 10:12 PM