AR Constable Arrested: గంజాయి పార్టీలో ఏఆర్ కానిస్టేబుల్!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:25 AM
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మసీదుబండ ప్రాంతంలో ఉన్న కోవే స్టే హోటల్‌లో కొందరు మద్యం పార్టీ పేరుతో మత్తుపదార్థాలు....
గచ్చిబౌలి కోవే స్టేలో పార్టీ.. ఈగల్ దాడులు
వైద్యపరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్.. అరెస్టు
హైదరాబాద్, రాయదుర్గం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మసీదుబండ ప్రాంతంలో ఉన్న కోవే స్టే హోటల్‌లో కొందరు మద్యం పార్టీ పేరుతో మత్తుపదార్థాలు సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులతో కలిసి ఈగల్ బృందాలు దాడులు నిర్వహించాయి. అక్కడ పార్టీ చేసుకుంటున్న ఎనిమిది మందికీ వైద్యపరీక్షలు నిర్వహించగా.. వారిలో ఐదుగురు గంజాయి సేవించినట్లు నివేదిక వచ్చిందని ఈగల్ అధికారులు తెలిపారు. పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ అని సమాచారం. తేజశ్వర్, రవి, సాయిప్రసాద్, రమేష్, మేఘేందర్‌లకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని.. వారిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. 2019లో హోటల్ మేనేజ్‌మెంట్ విద్య పూర్తిచేసుకున్న వీరంతా.. తరచూ ఆ హోటల్‌లోని రూమ్ నంబర్ 309లో డ్రగ్స్ పార్టీ చేసుకునేవారని అధికారులు వెల్లడించారు. వారికి గంజాయి ఎవరు ఇచ్చారు? ఎన్నాళ్ల నుంచి వారు గంజాయి తీసుకుంటున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.